HomeTelugu politics

జనసేనానితో సమావేశమైన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Published By :  Divya Valluru Image Image
BJP AP chief Somu Veerraju meets Janasena chief Pawan Kalyan
Friday Aug 07, 2020
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఈ రోజు కలిశారు. ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌ లో పవన్ ను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు పుష్ప గుచ్ఛం అందించి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి

వీరి భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.  ఏపీలో జరిగే 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే పలు కార్యక్రమాలు ఉమ్మడిగా చేపడుతున్నాయి. 

పవన్ ను కలిసే ముందు వీర్రాజు సినీ నటుడు చిరంజీవిని కూడా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. సోమును పూలమాల, శాలువాతో సత్కరించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి సోము వీర్రాజు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు.

   Politics

   Lifestyle