HomeTelugu politics

జగన్ కు గుడి కట్టడం పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
YCP MP RaghuRamaKrishnamRaju Fires on YCP Leader over Jagan temple
Thursday Aug 06, 2020
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజపాలెంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి గుడి కట్టడానికి సిద్దమయ్యారు. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు భవిష్యత్‌లో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. స్థానిక వైసీపీ నేతల సహకారంతో  కట్టనున్న గుడికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. అయితే వైసీపీ అధినేతకు కట్టబోయే గుడిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘గుడి, దేవాలయం అన్న మాటలు హిందూ మతానికి సంబంధించినవి. వైఎస్‌ జగన్‌ మీద నాకూ అభిమానం, ప్రేమ, గౌరవం వున్నాయి. కానీ, హిందువుడిగా నేను ఈ చర్యల్ని వ్యతిరేకిస్తున్నాను. కావాలంటే చర్చి కట్టుకోండి..’ అంటూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను సంచలనంగా మారాయి.

‘ఓ ప్రజా ప్రతినిది ఇలాంటి చర్యలకు ఒడిగట్టడం అస్సలే మాత్రం సబబు కాదు. ఆయనకు ప్రేమ వుంటే, ఇంట్లో వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. అంతే తప్ప, హిందూ మతాన్ని కించపర్చేలా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఇలాంటోళ్ళను ప్రోత్సహించడమంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే ఈ విషయంపై స్పందించాలి. ప్రజల గుండెల్లో గుడి కట్టుకోవాలి తప్ప. ఇలా పార్టీ నేతలతో గుడులు కట్టించుకుంటే, అది మీ స్థాయికి తగదు..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి రఘురామకృష్ణ మండిపడ్డారు.

   Politics

   Lifestyle