HomeTelugu politics

నిమ్మగడ్డ రమేష్ విషయంలో ఏపి ప్రభుత్వానికి గవర్నర్ కీలక ఆదేశాలు
Published By :  Lasya Raghavaraju Image Image
AP governor orders govt to continue nimmagadda ramesh kumar as SEC
Wednesday Jul 22, 2020
ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో మరో షాక్ తగిలింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి తనను మళ్లీ ఏపీ ఎస్ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు లేఖ రాసినట్లు సమాచారం. 

 ఇక  నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారంపై ఆయన గవర్నర్ ను కలిసిన రోజునే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ స‌ర్కార్‌. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిష మీద స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది ప్ర‌భుత్వం.. ఓవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉన్న స‌మ‌యంలో.. కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం స‌రికాద‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొంది.

   Politics

   Lifestyle