HomeTelugu politics

రాహుల్‌ గాంధీ చెప్పిన ప్రధాని మోదీ ఆరు విజయాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Rahul Gandhi takes dig at center lists its achievements amid Covid 19
Tuesday Jul 21, 2020
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ ఆరు విజయాలు సాధించారంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో రాహుల్ ఎద్దేవా చేశారు. 

‘‘కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మోదీ సర్కార్‌ సాధించిన విజయాలు- ఫిబ్రవరి: హలో ట్రంప్‌, మార్చి: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ కూల్చివేత, ఏప్రిల్‌: కరోనాపై పోరుకు కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే: మోదీ సర్కార్‌కు ఆరో వార్షికోత్సవం, జూన్‌: బిహార్లో వర్చువల్‌ ర్యాలీ, జులై: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

కరోనా వైరస్‌ను కట్టడి చేయాల్సిన సమయంలో ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలతోనే భారత్‌ కరోనా వైరస్‌పై పోరాటంలో ‘స్వయం సమృద్ధి’ సాధించిందని రాహుల్‌ ఘాటుగా విమర్శించారు. 

   Politics

   Lifestyle