HomeTelugu politics

కారులో దొరికిన డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా : మంత్రి బాలినేని
Published By :  Divya Valluru Image Image
AP Minister Balineni challenges TDP over Rs 5 Cr Cash and gold
Thursday Jul 16, 2020
ఏపి తమిళనాడు బోర్డర్ లో వైసీపీ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి  స్టిక్కర్ ఉన్న ఫోర్చ్యునర్ కారులో, రూ.5.22 కోట్లను తమిళనాడు పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే . అయితే కారులో దొరికిన రూ. 5 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆ డబ్బు తనదే అని టీడీపీ నేతలు నిరూపిస్తే... తాను మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. 

తమిళనాడు రాష్ట్రంలోని ఎళావూరు వద్ద రూ.5 కోట్లతో పట్టుబడిన కారుకు, అందులోని డబ్బుకు పార్టీకి గానీ నాకు ఎలాంటి సంబంధం లేదని బాలినేని స్పష్టంచేశారు.  ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.

భుదవారం సాధారణ తనిఖీల్లో భాగంగా, ఏపి తమిళనాడు బోర్డర్ లో కారుని తమిళనాడు పోలీసులు ఆపారు. ఈ సమయంలో, కారులో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు, తాము చెన్నై వెళ్ళాలి అంటూ పోలీసుల పై ఒత్తిడి తెచ్చారు. అయితే రాత్రి పూట పంపించం అని తమిళనాడు పోలీసులు చెప్పటంతో, ప్రకాశం జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో ఫోన్ చేయించారు. దీంతో వ్యవహారం తేడాగా ఉందని అనుమానపడిన తమిళనాడు పోలీసులు, కారుని తనిఖీ చెయ్యగా, భారీగా డబ్బు కనుగున్నారు. దీంతో, కారు సీజ్ చేసిన అధికారులు, కారులో ఉన్న ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుని ఐటి శాఖకు అప్పచెప్పటంతో, ఐటి అధికారులు రంగంలోకి దిగారు.

మరో పక్క టిడిపి నేతలు మాత్రం పట్టుబడిన డబ్బు బాలినేనిదే అని, మద్యం ముడుపుల డబ్బులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజం ఏమిటో అధికారులే చెప్పాలి.

   Politics

   Lifestyle