HomeTelugu politics

సచిన్ పైలట్ పై వేటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగింపు
Published By :  Lasya Raghavaraju Image Image
Congress sacks Sachin pilot and 3 from Ashok gehlot cabinet
Tuesday Jul 14, 2020
రాజస్థాన్ రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ తో సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం జరిగిన రెండో దఫా కాంగ్రెస్‌‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీకీ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలో పనిచేయలేమని, సీఎం పదవి మార్పు జరగాల్సిందేనని సచిన్‌ పైలట్‌ కీలక డిమాండ్‌ చేసినట్టు సమాచారం. 

మరోవైపు రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్‌ను తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీలో చెప్పారు. ఆ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్రా‌ను నియమించినట్లు తెలిపారు. అలాగే సచిన్ పైలట్ వెంట ఉన్నవిశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. 

సచిన్ పైలట్, అతడి సహచరులు కొందరు బీజేపీ కుట్రలో చిక్కుకున్నారని, 8 కోట్ల మంది రాజస్థానీలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేస్తుండటాన్ని తాను చింతుస్తున్నానని రణదీప్ సుర్జేవాలా అన్నారు.  మరోవైపు సచిన్ పైలట్ కోసం తమ తలుపులు తెరిచే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

   Politics

   Lifestyle