HomeTelugu politics

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్
Published By :  Divya Valluru Image Image
Dokka Manikya Varaprasad filed nomination as ysrcp mlc candidate
Thursday Jun 25, 2020
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. నేడు నామినేషన్‌ గడువుకు చివరి రోజు కావడంతో డొక్కా వరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు

గత టీడీపీ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగిన విషయం తెలిసిందే. మార్చి 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన వైసీపీలో చేరారు. ‘‘2014, 2015లోనే వైఎస్సార్‌సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్‌సీపీలో చేరాను. జగన్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి’’ అని పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.  

డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

   Politics

   Lifestyle