HomeTelugu politics

టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కేసు
Published By :  Divya Valluru Image Image
TDP former Minister Ayyannapatrudu booked under Nirbhaya case
Wednesday Jun 17, 2020
టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయింది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 

రెండు రోజుల క్రితం నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో చైర్మన్ గదిలో ఉన్న అయ్యన్న పాత్రుడు తాత ఫొటోను అధికారులు తొలగించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.  ఈ విష‌యంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తోట కృష్ణ‌వేణిని ఆయ‌న నిందించిన‌ట్టుగా తెలుస్తోంది.  నెల రోజులు టైమిస్తున్న‌ట్టుగా, అప్ప‌టికీ త‌న తాత ఫొటోను కార్యాల‌యంలో త‌గిలించ‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించార‌ట అయ్య‌న్న‌. ఈ క్ర‌మంలో తనపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్భయ,దిశ చట్టం కింద కేసు నమోదైంది. 

డ్యూటీలో ఉన్న ఆఫీస‌ర్ ను నిందించ‌డ‌మే గాక‌, మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఆయ‌న మాట్లాడిన తీరు నేప‌థ్యంలో.. నిర్భ‌య చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. కాగా ఓ మాజీ మంత్రిపై దిశ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతలు వివిధ కేసుల్లో అరెస్టు కావడంతో మరో మాజీ మంత్రిపై కేసు నమోదు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

   Politics

   Lifestyle