HomeTelugu politics

నగరి ఎమ్మెల్యే రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
Published By :  Lasya Raghavaraju Image Image
TDP leader Divyavani sensational comments about MLA Roja
Friday Jun 12, 2020
సీనియర్ నటి, టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన ఆమె వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీసీ నేతను వేధించి జగన్ సైకో ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో కూల్చివేతలు, కక్ష సాధింపులకే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రోజాను ‘ఐటం సాంగ్’తో పోల్చుతూ విమర్శలు చేశారు.  

‘రోజా వైసీపీలోకి అడుగు పెట్టడగానే ఎండ్ కార్డ్ పడింది. జైల్లో జగ్గూ అనే సీరియల్ 16 నెలలు సాగింది.  జైలుకి రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట ఇప్పటికీ ఉంది.  వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే. జగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించింది ఏమి లేదు. నిజంగానే ఏదైనా మంచి పని చేస్తే రోజా రెడ్డి ధైర్యంగా చెప్పాలి. ఈ విషయాలన్ని రోజా  గుర్తిస్తే మంచిది’ అని మండిపడ్డారు.

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు అంటూ రోజా చేసిన విమర్శలపై దివ్యవాణి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

"రోజా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని రోజా వ్యాఖ్యలు చేసింది, గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా తప్పు చేశారు కాబట్టే 16 నెలలపాటు జైల్లో ఉన్నారా అంటూ విమర్శలు గుప్పించారు దివ్యవాణి.

   Politics

   Lifestyle