HomeTelugu politics

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావు
Published By :  Ravi Koneri Image Image
TDP former MP Sidda Raghavarao formally joins YSRCP
Wednesday Jun 10, 2020
తెలుగుదేశం పార్టీ నుంచి మరో కీలక నేత అధికార వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు.  పార్టీ సీనియర్ నేత,  మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నాడు. . ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. 

శిద్దా రాఘవరావు తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో శిద్దా మాట్లాడుతూ, జగన్ సమక్షంలో వైసీపీలో చేరానని చెప్పారు. ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని... భవిష్యత్తులో కూడా అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

   Politics

   Lifestyle