HomeTelugu politics

అఖిలప్రియ నా హత్యకు కుట్ర చేసింది ఆమెను అరెస్ట్ చేయండి అంటున్న ఏవీ సుబ్బారెడ్డి
Published By :  Lasya Raghavaraju Image Image
TDP leader AV Subbareddy levelled serious allegations against Akhila Priya
Thursday Jun 04, 2020
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు పై టీడీపీ నేత, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు నకిలీ నక్సలైట్ల ద్వారా తనను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. తనను చంపడానికి రూ.కోటి ఒప్పందం చేసుకున్నారని, రామిరెడ్డి, రవిచంద్రారెడ్డిలు చెరో రూ.50లక్షలకు ఈ మర్డర్ ఒప్పుకున్నారని.. వీరిని పోలీసులు అరెస్ట్ చేస్తే విషయం బయటకు వస్తుందన్నారు.  

నకిలీ నక్సలైట్లు రవిచంద్రారెడ్డి, రామ్ రెడ్డి,సంజోరెడ్డి ల ద్వారా ఈ హత్యయత్నం జరిగిందని, పోలీసులు దానిని ఛేదించి తన ప్రాణాలు కాపాడారన్నారు. రెండు నెలల క్రితం తనను హత్య చేయడానికి జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారని కానీ అందుకు కారణమైన మాజీ మంత్రి అఖిలప్రియ,భార్గవ్ రామ్ ని అరెస్ట్ చేయలేదని వీరిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  ఈ కేసులో మొత్తం ఆరుగురు ముద్దాయిలు ఉన్నారని.. వీరిలో అఖిలప్రియ A4, ఆమె భర్త భార్గవ్ A5గా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఖిల ప్రియని కన్న కూతురుగా పెంచితే నన్ను చంపడానికి సుఫారీ ఇవ్వడం దారుణం అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకున్నారు. 

ఏవీ సుబ్బారెడ్డి దివంగత భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీతో సుబ్బారెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే.

   Politics

   Lifestyle