HomeTelugu politics

వైసిపి గూటికి చేరనున్న మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు
Published By :  Divya Valluru Image Image
Blow to TDP in Prakasam dist as 2 MLAs to join ruling YSRCP
Tuesday May 26, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివరావు ,గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ టీడీపీని వదిలి అధికార వైసీపీ పార్టీ లో చేరడానికి సిద్ధమయ్యారని సమాచారం. వీరిద్దరూ మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తన క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ గత ఎన్నికల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు. నివేదికల ప్రకారం, మోపిదేవి రాజ్యసభ సభ్యుడయ్యాక ఢిల్లీకి వెళతారు మరియు నియోజకవర్గ బాధ్యత సత్య ప్రసాద్‌కు అప్పగించబడుతుంది. పర్చూర్ ఎమ్మెల్యే భారీగా  రుణాలు తీసుకున్నందున తన వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌ వైసిపికి మద్దతు తెలిపాడు. మరోవైపు అద్దంకి ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవి కూడా వైసిపిలో చేరతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈనెల 30వ తేదీన ప్రకాశం జిల్లా నుంచి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు భారీగా టిడిపి నేతలు కూడా వైసిపిలో చేరే అవకాశముంది.

   Politics

   Lifestyle