HomeTelugu politics

తిరుమల ఆలయ ఆస్తుల అమ్మకం పై ఘాటుగా స్పందించిన పవన్
Published By :  Ravi Koneri Image Image
Pawan Kalyan questions YCP government over TTD lands sale
Monday May 25, 2020
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకంపై రగడ కొనసాగుతోంది. దాతల ద్వారా  టీటీడీకి సమకూరిన ఆస్తులను వేలం వేయడానికి సిద్దమైన టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నాయి. తాజగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీ ఆస్తులను అమ్మే అవసరం ఏమోచ్చిందో చెప్పకుండా నిర్ణయం చేయడం‌ తగదన్నారు.   ఈ ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, టీటీడీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన పవన్ .. తమిళనాడులోని ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, టీటీడీ బోర్డు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. టీటీడీ భూములను లీజుకు ఇవ్వడం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయాలన్నారు. యాజమాన్య హక్కులను కోల్పోకుండా ఆదాయాన్ని సంపాదించడంపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నించారు. ఉద్యోగాలు సృష్టించడానికి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పెట్టుబడిదారులు అవసరమని, ఏ ప్రభుత్వానికైనా ప్రధాన ఆదాయ వనరులలో భూమి ఒకటిగా ఉంటుందన్నారు. విలువను సృష్టించడానికి ఉపయోగించబడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా భూమిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించాలని సూచించారు. భక్తుల మనోభావాలను, నమ్మకాన్ని దెబ్బతీయడం సరి కాదని హితవు పలికారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్థిక అవకాశాలను పణంగా పెట్టడం చేటు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులలో టీటీడీ భూములను అమ్మేందుకు అనుమతిస్తే అది చాలా పెద్ద తప్పని పవన్ హెచ్చరించారు.  

తమిళనాడులోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన 23 ఆస్తులను విక్రయించయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

   Politics

   Lifestyle