HomeTelugu politics

రంగుల జీవో పై జగన్ సర్కార్ కు హై కోర్ట్ భారీ షాక్
Published By :  Lasya Raghavaraju Image Image
AP High Court dismisses state govt YSRCP colors order
Friday May 22, 2020
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేసేందుకు వీలుగా తీసుకొచ్చిన జీవో పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇటీవల తీసుకువచ్చిన 623జీవోను ధర్మాసనం రద్దు చేసింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పార్టీ రంగులు తొలగించకుండా కొత్త జీవో తేవడం ఏంటని ప్రశ్నించింది. ఇది  కోర్టు దిక్కరణ చర్య కిందకు వస్తుందని హెచ్చరించింది. వారం లోగా రంగులపై సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తామని పేర్కొంది. ఈనెల 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  దీనిపై పంచాయతీ రాజ్ సెక్రెటరీ,సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. 

గతంలో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. పార్టీ రంగులు తొలగించి వాటి స్థానంలో వేరే రంగులు వేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని అలాగే ఉంచి మరో రంగును చేర్చాలని జీవో ఇచ్చారు. మూడు రంగులతో పాటు మట్టి రంగును చేర్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని వ్యతిరేకిస్తూ.. సోమయాజులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం జీవో 623ను రద్దు చేసింది. 

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, నీటి ట్యాంకులకు వైసీపీ రంగులు వేయొద్దని తాము గతంలో ఆదేశాలు ఇచ్చినా వాటిని ఉల్లంఘించి రంగులు కొనసాగిచండంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు ఉల్లంఘన చర్యలు ప్రారంభించాలని సీఎస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

   Politics

   Lifestyle