HomeTelugu politics

ఏపీ బీజేపీ పై మాధవీలత సంచలన పోస్ట్
Published By :  Lasya Raghavaraju Image Image
Actress Madhavi Latha shocking post on Yamini over party post
Wednesday Apr 22, 2020
టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన సాధినేని యామినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడి ఆయన్ను విమర్సించే వారికి తన పదునైన మాటలతో సమాధానాలు చెప్పిన మాధవీలత బిజెపి తరపున గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. అయితే ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ టీడీపీ ఓటమి తర్వాత బిజెపితో చేరిన సాధినేని యామినికి అధికార ప్రతినిధి పదవి ఇవ్వడంతో మాధవీకి చిర్రెత్తుకొచ్చింది. 

దీంతో ఏపీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఒకప్పుడు టీడీపీలో ఉంటూ బీజేపీని, మోడీని బూతులు తిట్టిన పచ్చ చీరకే ఇప్పుడు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటూ ఆమె విమర్శించారు. పచ్చ చీరకు పదవి అంటగట్టింది ఎవరు అని ప్రశ్నించారు.

మాధవీలత పెట్టిన పోస్ట్ యథాతథంగా

పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం బిజెపి ని అమ్మ నా బూతులు తిట్టి, ప్రధానిని తిట్టి , అధ్యక్షుడిని తిట్టి ఇపుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇపుడు అందరికి ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు, మరి కొత్తగా వచ్చిన పచ్చ చీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు ?? 

పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారం లో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడారనా? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని.

మా సినిమాలోనే అనుకున్న పక్క బాషా వాళ్ళని తెచుకుంటారని. ఔనులే పక్క పార్టీ నుండి వచ్చి కండువా కప్పుకున్నవారు అధికారం ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి మారిపోతారు కదా !. అందుకేనేమో ఆంధ్రలో పార్టీ స్థాయి గతితప్పుతుంది. పచ్చ కండువాలు కప్పుకుని వచ్చిన వారికే ఇక్కడ విలువ, గౌరవం. కష్టపడి పనిచేసేవాళ్ళకి గౌరవాలు ఉండవు. ఇది నిజం ఇదే నిజం ఎవరు ఖండించినా సరే. నిజాన్ని దైర్యంగా చెప్పే దమ్ము నాకుంది . ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది .

సాహో జజయో రాజకీయం …..
బాబులు అమ్మలూ తిట్టండయ్యా బాగా తిట్టండి.
తర్వాత వచ్చి కాషాయం కప్పుకోండి పదవులు ఇస్తారు.
ఇది నిజం.
కాలింది అనుకోండి కడుపు మంట అనుకోండి.
కానీ ఇదే నిజం.

దీంతో ఒక్కసారిగా ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. కానీ మాధవీలత విమర్సలపై సాధినేని యామిని మాత్రం స్పందించలేదు.