HomeTelugu politics

కరోనా విషయంలో మీ విజన్ ఫెయిలైంది మోదీజీ అంటూ కమల్ ఘాటు లేఖ
Published By :  Lasya Raghavaraju Image Image
MNM chief Kamal Haasan pens strong letter criticisng Modi over Lockdown
Monday Apr 06, 2020
కరోనా మహమ్మారిని ఎదుర్కొనెందుకు కేంద్రం మూడు వారాల  లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ అమలు లోపభూయిష్టంగా ఉందని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి సోమవారం ఘాటైన వ్యాఖ్యలతో బహిరంగ లేఖ రాశారు. 

నోట్ల రద్దు నిర్ణయం తరహాలోనే అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారని ఆరోపించారు. నాడు నోట్ల రద్దుతో  పేద ప్రజల పొట్టకొట్టారని, నేడు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధితో పాటు జీవితాలే గల్లంతవుతున్నాయని తెలిపారు. డీమానిటైజేషన్ మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోదీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో కూడా పేదలే నష్టపోయారని గుర్తుచేశారు. దీని ప్రభావం దేశ జీడీపీ మీద పడుతుందని కమల్ లేఖలో రాసాడు.  

"మీరు దీపాలు వెలిగించమంటే మీ వాళ్లు బాల్కనీల్లో ఎంచక్కా మంచినూనెతో దీపాలు వెలిగించారు, కానీ పేదలు మాత్రం రొట్టెలు చేసుకునేందుకు నూనె దొరక్క అవస్థలు పడుతున్నారు. మీ ప్రసంగాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్కనీలు 'ఉన్న'వాళ్ల భయాలు తొలగించేందుకు మీ ప్రసంగాలు ఉపయోగపడుతున్నాయి, కానీ, నెత్తిన పైకప్పు తప్ప మరేమీ లేని బడుగుల మాటేమిటి? జీడీపీకి ప్రధాన వనరు అనదగ్గ పేదవాళ్లను విస్మరించడం తగదు. అలాంటివారిని అణగదొక్కాలని జరిగిన ప్రయత్నాలకు చరిత్రలో ఎలాంటి జవాబులు వచ్చాయో మీరు తెలుసుకోవాలి.

చైనాలో తొలి కరోనా కేసు వచ్చినప్పటి నుంచి మీరు ఎందుకు స్పందించలేదు? మీ దార్శనికత ఏమైంది? హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించారు. దార్శనికత ఉన్న నాయకులైతే సమస్య తీవ్రతరం కాకముందే స్పందిస్తారు. ఈ విషయంలో మీరు విఫలం అయ్యారనే భావిస్తున్నాం. మీరు అందరినీ కలుపుకుని ముందుకుపోవాలనుకుంటే మేము సైతం మీకు తోడుగా ఉంటాం, మాకు ఎంతో ఆగ్రహం కలుగుతున్నా గానీ మేం ఇప్పటికీ మీవెంటే ఉన్నాం" అంటూ లేఖను ముగించారు.