HomeTelugu politics

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా
Published By :  Lasya Raghavaraju Image Image
Madhya Pradesh CM Kamalnath resigns to his CM Post
Friday Mar 20, 2020
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించే ముందేు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవిషయం వెల్లడించారు. మరికాసేపట్లో గవర్నర్‌ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్‌ రాజ్‌భవన్‌లో కలవనున్నారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను కమల్‌నాథ్‌ సమర్పించనున్నారు. 

రాజీనామా ప్రకటన సందర్భంగా సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాజకీయాలపై కమల్‌నాథ్‌ తీవ్రంగా స్పందించారు.  2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీజేపీ తమకు వ్యతిరేకంగా పని చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందన్నారు. ప్రజా తీర్పును బీజేపీ అవమానించింది. బీజేపీ పాలనలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పని చేయడం బీజేపీకి నచ్చలేదు అని కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు రాష్ర్టానికి ద్రోహం చేశారు. తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు అని కమల్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 నెలల పాలనలో మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేశాను. సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించామని తెలిపారు. బీజేపీ 15 సంవత్సరాల్లో చేయలేనిది.. తాను 15 నెలల్లో చేసి చూపించాను అని స్పష్టం చేశారు. రైతులు తమపై ఎంతో విశ్వాసం ఉంచారు.  వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాం.. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోవడంతో ఆయన బలపరీక్ష ఎదుర్కోక ముందే రాజీనామా చేయడం గమనార్హం. 

   Politics

   Lifestyle