HomeTelugu politics

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కవిత
Published By :  Divya Valluru Image Image
KCR daughter Kavitha files nomination for Nizamabad MLC seat
Wednesday Mar 18, 2020
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ కాగా, బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత సునాయాసంగా గెలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7న పోలింగ్ నిర్వహించి‌ 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.  2015లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన  భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.  ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 వరకు ఉండటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రక్రియ చేపట్టింది.

కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే… ఆమె రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తు న్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కవిత… ఎమ్మెల్సీగా ఎన్నికైతే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లో బిజీ అయినట్టే అనే చెప్పుకోవాలి.

   Politics

   Lifestyle