HomeTelugu politics

కరోనా భయంతో స్వీయ నిర్బంధంలోకి సురేష్ ప్రభు
Published By :  Lasya Raghavaraju Image Image
BJP MP Suresh Prabhu in home quarantine after Saudi visit
Wednesday Mar 18, 2020
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కరోనాకు మందు లేకపోవడం...కరోనా సోకిన వారిలో అధిక శాతం విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారే కావడంతో.. విదేశీ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విదేశాల నుంచి తిరిగివచ్చిన సురేష్ ప్రభు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

సౌదీ అరేబియాలో మార్చి 10న జరిగిన జీ-20 దేశాలకు సంబంధించిన సమావేశంలో సురేష్ ప్రభు పాల్గొన్నారు. సౌదీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి నుంచి వచ్చాక సురేష్ ప్రభుత్వ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా లేదని డాక్టర్లు నిర్ధారించారు. అయినా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధం విధించుకున్నారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

ఇప్పటి వరకు 165 దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 98 వేల 426 మందికి కరోనా సోకగా, 7,987 మంది మృతి చెందారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,237కు చేరింది. ఇటలీలో 2,503 మంది, ఇరాన్‌లో 988, స్పెయిన్‌లో 533, ఫ్రాన్స్‌లో 175, అమెరికాలో 115, దక్షిణ కొరియాలో 84, యూకేలో 71, నెదర్లాండ్స్‌లో 43, జపాన్‌లో 29 మంది మృతి చెందారు. భారత్‌లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

   Politics

   Lifestyle