HomeTelugu politics

పసువు జెండాను వదిలిపెట్టం ; పరిటాల శ్రీరాం క్లారిటీ…!
Published By :  Lasya Raghavaraju Image Image
Paritala Sriram denies party change rumors with Twitter letter
Monday Mar 16, 2020
పరిటాల కుటుంబం త్వరలో టీడీపీని వీడుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. . చంద్రబాబు నుంచి సహకారం అందడం లేదని, తమను కాదని జేసీ దివాకర్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందుకే పార్టీని వీడాలన్న ఆలోచనలో సునీత, శ్రీరామ్, కార్యకర్తలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే, పరిటాల కుటుంబం అధికార వైసీపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జోరందుకోవడంతో మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 

తాము పార్టీ మారేది లేదని, తమ తండ్రి సిద్దాంతాలతో ముందుకి వెళ్తామని, తెలుగుదేశం పార్టీ యువనేత, దివంగత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన  ట్విట్టర్ వేదికగా మీడియాకు ఒక లేఖ రాసారు.

‘తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్బ్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం.. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కుసంస్కృతి మాకు లేదు.. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి..’ అంటూ శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

   Politics

   Lifestyle