HomeTelugu politics

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు
Published By :  Lasya Raghavaraju Image Image
Nagababu thanks AP CM Jagan for Civic polls postpone
Monday Mar 16, 2020
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దావానంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా ద్వారా జగన్ కు థాంక్స్ తెలిపారు. 

"కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం.. focus on it. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టండి.. 151 మంది ఎమ్మెల్యేలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం.. థాంక్స్ సీఎం గారు అంటూ ట్వీట్ చేశారు.

కొంతమంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల websitesలో విమర్శిస్తుంటే ఆశ్చర్య పోయాం. మీరు వైఎస్సార్‌సీపీని సమర్ధిస్తే తప్పు లేదు.. కానీ వైఎస్సార్‌సీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఎడవలో అర్థం కాలేదు. life కన్నా ఏది ఎక్కువ కాదు.. బాధపడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి. ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా , మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, అన్నిటికన్నా, మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. ఎన్నికలు ఆపలేదు, postpone చేశారు. ఈ ఎలక్షన్ అకౌంట్‌లో కరోనా ఎఫెక్ట్‌కి ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా.. వైఎస్సార్‌సీపీ వాళ్ళకి వాళ్ళ సపోర్టర్స్‌కి ఎందుకు ఇంత బాధ అన్నారు మెగా బ్రదర్.

   Politics

   Lifestyle