HomeTelugu politics

ఐటీ దాడుల అంశంపై నారా లోకేష్ సెటైర్లు
Published By :  Divya Valluru Image Image
Nara Lokesh satirical tweets about AP IT raids issue
Friday Feb 14, 2020
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడుల వ్యవహారంలో వైసీపీ నేతలంతా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.  40 చోట్ల ఐటీ దాడులు చేసి, మొత్తం రూ.2 వేల కోట్ల విలువ చేసే డబ్బు లెక్క తేలాల్సి ఉందని ఐటీ విభాగం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, ఆ డబ్బంతా చంద్రబాబు పీఎస్  ఇంట్లోనే దొరికిందని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.

ఈ నేపధ్యంలో ఐటీ దాడుల వ్యవహారం పై టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బూటకపు రాతలు ఆపి ప్రజల గురించి ఆలోచించాలని వైసీపీ ప్రబుత్వానికి హితవు పలికారు. 

"జగన్ గారూ, చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే ఈ గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ఇకనైనా మీ బూటకపు రాతలు ఆపి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. అందులో పైభాగంలో సాక్షి పత్రికలో చంద్రబాబు అవినీతి అంటూ వచ్చిన బ్యానర్ ఐటమ్, కిందిభాగంలో ఓ గుడ్డు వంక తదేకంగా చూస్తున్న సీఎం జగన్ ఫొటో చూడొచ్చు.

   Politics

   Lifestyle