HomeTelugu politics

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులు.. ఢిల్లీలో కలకలం
Published By :  Lasya Raghavaraju Image Image
AAP MLA Naresh Yadav shot at during victory rally, one volunteer dead
Wednesday Feb 12, 2020
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయపతాకం ఎగురవేసింది. మరోసారి కేజ్రీవాల్‌కే పాలన బాధ్యతలను ప్రజలు కట్టబెట్టారు.  వరుసగా మూడోసారి కేజ్రివాల్ ముఖ్యమంత్రి కన్నున్నారు. దీంతో పార్టీ కేడర్, లీడర్లు అంతా సంతోషంలో మునిగిపోయారు. ఈ సమయంలో తన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు జరగడం కలకలం రేపాయి. మెహ్‌రౌలీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఫలితాల వెల్లడి తర్వాత ఆప్ ఎమ్మెల్యే నరేశ్ దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడి ఘటనలో అశోక్ మన్ అనే కార్యకర్త మరణించాడు. మరో కార్యకర్త గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ఎమ్మెల్యే మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

కాల్పుల ఘటన పై ఆప్ సీరియస్ అయింది. ఫలితాలను జీర్ణించుకోలేక చేసిన పనేనని వ్యాఖ్యానించింది. కార్యకర్త మరణంపై విచారం వ్యక్తం చేసింది. 

   Politics

   Lifestyle