HomeTelugu politics

ఢిల్లీని ఊడ్చేస్తున్న చీపురు ; గెలుపు దిశగా ఆప్
Published By :  Lasya Raghavaraju Image Image
Delhi Assembly Elections ; Aam Aadmi Party is set to win again
Tuesday Feb 11, 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య మొద‌లైంది. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.  అందుతున్న వార్తల ప్రకారం అత్యధిక స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 

న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ముందంజలో ఉన్నారు. అలాగే పట్పర్ గంజ్ లో ఉప ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా ముందంజలో ఉన్నారు.  చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదట ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని అల్కాలాంబ వెనుకబడి పోయారు.మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి కపిల్ మిశ్రా, న్యూఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి సునీల్ యాదవ్, శీలంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మతీన్ అహ్మద్ లు తమ సమీప ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు.కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషీ వెనుకంజలో పడిపోయారు.

ఇక మరోసారి హస్తినలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంచనాలు నిజముతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. గత అయిదేళ్ళుగా అరవింద్ కేజ్రివాల్ తాను చేపట్టిన కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. బిజెపి ఎన్ని వ్యూహాలు రచించినా సరే, ఆప్ అభివృద్ధి ముందు తెలిపోయాయి. 

   Politics

   Lifestyle