HomeTelugu politics

జగన్‌ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్
Published By :  Divya Valluru Image Image
Nara Lokesh sensational comments on YCP Govt
Thursday Feb 06, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వం పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.  మంగళవారం నాడు గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సభ నిర్వహించిన నారా లోకేష్ మాట్లాడుతూ...వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ప్రజలందరిలో ఒకరకమైన వ్యతిరేకత మొదలైందని, మరికొద్దిరోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు.

ఈ నేపధ్యంలో నారా లోకేష్ అధికార వైసీపీ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వైకాపా మేనిఫెస్టోలో రాజధానిని అమరావతి నుండి మారుస్తామని ఎందుకు ప్రకటించలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇకపోతే ఆంధ్రులు ఎంతగానో కళలు కని రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారని, అందుకనే తమ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికై, అన్ని జిల్లాల అభివృద్ధికై పరిశ్రమలు నెలకొల్పారని చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో 25 మంది రైతులు చనిపోతే, ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు.

   Politics

   Lifestyle