HomeTelugu politics

ఎన్‌పిఆర్ అవసరం, సిఎఎ వల్ల ముస్లింలకు ముప్పు లేదు : రజినీకాంత్
Published By :  Divya Valluru Image Image
Rajinikanth supports CAA and NPR says no threat to Muslims
Wednesday Feb 05, 2020
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బుధవారం నాడు తన పోయెస్ గార్డెన్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కొత్త పౌరసత్వం (సవరణ) చట్టం , జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్), మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. CAAకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఆయన... పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ పౌరులెవరికీ నష్టం జరగదని అభిప్రాయడ్డారు. ఒకవేళ ముస్లింలకు నిజంగానే అన్యాయం జరిగితే, వాళ్ల కోసం తాను మొదటగా స్వరం వినిపిస్తానని హామీ ఇచ్చారు.

ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లాభం కోసం సిఎఎపై భయాన్ని కలిగిస్తున్నాయి.. వారికి మత పెద్దలు కూడా తోడయ్యారు.. ఇది చాలా తప్పు. CAA భారత పౌరులను ప్రభావితం చేయదని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఇది పొరుగు దేశాల నివాసితులకు పౌరసత్వం కల్పించడం గురించి మాత్రమే' అని రజనీకాంత్ అన్నారు. 

'ఇక్కడ ముస్లింలకు ఎంత హక్కులు ఉన్నాయంటే.. దేశ విభజన సమయంలో ముస్లింలు (కొంతమంది) ఇక్కడే ఉండిపోయారు, ఇది వారి మాతృభూమి అని నిర్ణయించుకున్నారు. మరణించే వరకు వారు ఇక్కడే.. అలాంటిది ఎవరైనా వారిని దేశం నుండి ఎలా బయటికి పంపగలరు? ఇక్కడ ముస్లింలకు ఏమైనా ముప్పు ఉంటే ప్రశ్నించే మొదటి గొంతు నాదే' అని వ్యాఖ్యానించారు.

భారతీయ పౌరులు మరియు విదేశీయుల మధ్య తేడాను గుర్తించడానికి ఎన్‌పిఆర్ ఎంతో అవసరమని రజనీకాంత్ అన్నారు. ఈ దేశ పౌరులు ఎవరు? బయటి నుండి వచ్చిన వారెవరు అనే విషయం మనకు తెలియాలా వద్దా అని ప్రశ్నించారు. మరోవైపు శ్రీలంకన్ తమిళుల గురించి మాట్లాడిన రజనీకాంత్.. గత 30 సంవత్సరాలుగా తమిళనాడులో నివసిస్తున్న శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారిని మైనారిటీగా పరిగణించకూడదని.. చోళ రాజుల కాలం నుండి అక్కడ నివసిస్తున్నారని అన్నారు. 

ఇక తూత్తుకుడిలో హింసకు సంబంధించి మీకు సమన్లు వచ్చాయా అని విలేకరులు ప్రశ్నించగా.. 'నాకు ఇప్పటివరకు నోటీసు రాలేదు.. వస్తే ఖచ్చితంగా నా పూర్తి సహకారాన్ని అందిస్తాను' అని అన్నారు

   Politics

   Lifestyle