HomeTelugu politics

బిడ్డలూ, అమ్మలూ.. కాస్త జాగ్రత్త అంటూ చ‌ంద్ర‌బాబు ట్వీట్లు
Published By :  Lasya Raghavaraju Image Image
Chandrababu satirical tweets about Jagan's Ammavodi scheme rule
Tuesday Jan 28, 2020
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు వైసీపీ నాయ‌కులు ‘అమ్మఒడి’ పేరిట బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని జగన్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  ‘అమ్మఒడి’ పేరిట అమ్మలను బెదిరించి ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు ఆరోపించారు.  వెయ్యి రూపాయలు తమకు ఇవ్వకపోతే ఈ పథకం కింద వచ్చే మొత్తం డబ్బును ఆపేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ‘బిడ్డలూ, అమ్మలూ.. కాస్త జాగ్రత్త!’ అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

"చివరికి బడిలోనూ రౌడీ వసూళ్ళేనా? 'అమ్మఒడి' పేరిట బెదిరించి అమ్మల నుంచి రూ 1,000 వసూళ్లు చేయడం ఏంటి? ఇవ్వకపోతే మొత్తం రూ.15వేలు ఆపేస్తాం అని బెదిరిస్తారా? ఆ అధికారం మీకెక్కడిది? వసూలు చేసే రూ 1,000కి రశీదు ఇవ్వడం లేదు. లెక్కాపత్రం లేదంటే అవి చేరేది వైసిపి నేతల జేబుల్లోకేనని జనమే అంటున్నారు. బడుల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమిషన్లు కొట్టేసే "దొంగమామలను" ఇప్పుడే చూస్తున్నాం. బిడ్డలూ-అమ్మలూ... కాస్త జాగ్రత్త? అంటూ చంద్రబాబు వరుస ట్వీట్స్ పెట్టారు.  

అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలలో వెయ్యి రూపాయలు పాఠశాలకు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్ చిత్తూరు సభలో కోరిన విషయం తెలిసిందే. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కోసం ఆ డబ్బులు ఖర్చుచేస్తామని జగన్ తెలిపారు. 

   Politics

   Lifestyle