HomeTelugu politics

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్
Published By :  Ravi Koneri Image Image
JSP Cheif Pawan Kalyan meets newly elected BJP chief JP Nadda
Thursday Jan 23, 2020
అమరావతి నుంచి రాజధాని తరలింపుని ఎట్టి పరిస్థితిలో జరగనివ్వబోమని శపథం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానుకలిసారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన నడ్డాకు పవన్‌ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి,  మూడు రాజధానుల అంశంపై ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న  రగడ మరియు అక్కడ రైతుల చేస్తున్న ఆందోళన గురించి నడ్డాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. 

కేంద్రంలో బీజేపీ మద్దతుతో... రాష్ట్రంలో రాజధాని తరలింపును అడ్డుకోవాలని కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన విషయం తెలిసిందే.  వైకాపాను గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం బీజేపీతో కీలక చర్చలు జరుపుతున్నాడు. వైకాపాను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించేందుకు పవన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాలి. 

ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్‌ షాలను కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. ప్రధాని ముందు రాజధాని విషయం ఉంచి అమరావతిని శాస్వత రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ ఆదేశించాలని కోరనున్నాడు.

   Politics

   Lifestyle