HomeTelugu politics

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా
Published By :  Lasya Raghavaraju Image Image
JP Nadda elected new BJP President unopposed
Monday Jan 20, 2020
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా(జేపీ నడ్డా) సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల మధ్య అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల దాఖలు జరిగాల్సిఉంది. అయితే నడ్డా తప్ప ఎవరూ నామినేషన్ వెయ్యలేదు. ఫలితంగా మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.   జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధా మోహన్‌ సింగ్‌ నియామక పత్రాన్ని అందించారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 

ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రలతో నడ్డా సమావేశం కానున్నారు. 

నరేంద్ర మోదీ తొలి కేబినెట్‌లో నడ్డా ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. పార్టీలో చాలా హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది జులైలో బీజేపీ వర్కింగ్​ప్రెసిడెంట్​ అయ్యారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు పార్టీ ఇన్ఛార్జిగా చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ... ఎస్పీ, బీఎస్పీ కూటమిని ఓడించి 80 ఎంపీ సీట్లలో 62 గెలుచుకుంది. 

   Politics

   Lifestyle