HomeTelugu politics

బీజేపీ-జనసేన చరిత్రాత్మక బంధం మొదలైంది
Published By :  Divya Valluru Image Image
Janasena forms alliance with BJP in AP for 2024 elections
Thursday Jan 16, 2020
విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో భారతీయ జనతా పార్టీ-జనసేన నేతల మధ్య కీలక భేటీ ముగిసింది. వచ్చే సార్వత్రిక,స్థానిక ఎన్నికల్లో బీజేపీ తో కలిసి ముందుకువెళ్లాలని జనసేన నిర్ణయించుకుంది.  ఈ సమావేశంలో జనసేన తరపున పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌, సునీల్‌ దియోదర్‌, పురంధేశ్వరి, సోము వీర్రాజులు పాల్గొన్నారు.  సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. 

ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు. జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటే అన్నారు పవన్. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటా చేస్తామని తెలిపారు. బేషరుతుగా బీజేపీతో కలిసి వెళ్తున్నామని వివరించారు. రాజధాని రైతులను నిండా ముంచారని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పవన్. 5కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్య అవగాహన కోసం కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. 2024లో అధికారంలోకి వస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.  రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పోకడలో వెళ్తుందని కన్నా అన్నారు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడానికి అంగీకారం తెలిపారని, దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. బిజెపితో కలిసి పని చేయడానికి జనసేన ముందుకి వచ్చింది అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జనసేన-బిజెపితోనే సాధ్యమన్నారు.

   Politics

   Lifestyle