HomeTelugu politics

చంద్రబాబు చరిత్రహీనుడంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
MLA Roja sensational comments on TDP Chief Chandrababu Naidu
Thursday Jan 09, 2020
ఏపీఐఐసీ చైర్మన్‌, నగరి ఎమ్మెల్యే రోజా మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పై మరోసారి  నిప్పులు చెరిగారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని చరిత్రహీనుదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు.  చిత్తూరులో ''అమ్మఒడి'' పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రోజా ఈ కామెంట్స్ చేశారు.

"పేదల చదువు కోసం అమ్మఒడి తీసుకొచ్చిన చరిత్రకారుడు మన సిఎం జగన్ అయితే.. పేదల చదువుని కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు బలి చేసి చరిత్రహీనుడు చంద్రబాబు" అని రోజా ధ్వజమెత్తారు. పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. పేదలు చదివే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం అందించిన చరిత్రకారుడు జగన్‌ అయితే.. ఆ పేదపిల్లలు తినే కోడిగుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని విమర్శించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్న చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. తను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని చేతకాని చరిత్రహీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ.. చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు రోజా. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఎలాంటి పాలన అందించారో ఎంత అభివృద్ధి చేశారో గమనించాలని ప్రజలను కోరారు. పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు రోజా. పేద పిల్లల తల్లులు జగన్ ను ఆశీర్వదించాలని రోజా విన్నపం చేశారు.

   Politics

   Lifestyle