HomeTelugu politics

బీజేపీ కండువా కప్పుకున్న మోత్కుపల్లి నర్సింహులు
Published By :  Divya Valluru Image Image
Former Minister Motkupalli Narsimhulu formally joins BJP
Tuesday Jan 07, 2020
టీడీపీ బహిష్కృత నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు.  బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం ఇచ్చి జెపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటిమోహనరావుతో కలిసి ఆయన భేటీ అయ్యారు. 

ఈసందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..  "ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. దేశానికి గౌరవం తీసుకొస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నిజాం 8వ వారసుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా కొనసాగుతున్నారు. వ్యవస్థ పట్ల కేసీఆర్ ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు. ప్రజాస్వామ్యకి విరుద్దoగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రంలో చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కేసీఆర్ నెరవేర్చడం లేదు. ప్రజలు త్వరలో కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు’ అని అన్నారు. 

తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతోందని చెప్పారు. మోత్కుపల్లి రాక పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు లక్ష్మణ్ చెప్పారు. 

   Politics

   Lifestyle