HomeTelugu politics

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారు పై రాళ్ల దాడి..తీవ్ర ఉద్రిక్తత
Published By :  Divya Valluru Image Image
Amaravati activists hurl stones at YCP MLA Ramakrishnareddy Car
Tuesday Jan 07, 2020
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సమ్మె చేస్తున్న  రైతులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు పై రాళ్ల దాడి చేసారు.

చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకు దిగారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు.

ఘటన పై స్పందిస్తూ రామకృష్ణారెడ్డి రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. 

''విజయవాడకు వెళ్తుండగా నా కారుపై దాడికి జరిగింది. 50 మంది తాగేసి వచ్చి కారును చుట్టుముట్టారు. రెండు కార్లను అడ్డుపెట్టారు. ఏంటని అడిగినందుకు నా గన్‌మెన్‌పై దాడి చేశారు. ఇది రైతుల పని కాదు. టీడీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడకూడదు. నా కారుపై రాళ్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే భయంతో హింసను ప్రేరేపిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ముసుగులో కాకుండా దమ్ముంటే డైరెక్ట్‌గా అటాక్ చేయండి. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.'' అని రామకృష్ణ అన్నారు.

   Politics

   Lifestyle