HomeTelugu politics

వైఎస్ జగన్‌ వ్యక్తిగత సహాయకుడు నారాయణ కన్నుమూత
Published By :  Divya Valluru Image Image
YS Jagan shortens Delhi Tour after his PA Narayana demise
Friday Dec 06, 2019
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. నారాయణ మరణించిన వార్త గురించి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీలో ఉన్న జగన్.. తన షెడ్యూల్స్ ను రద్దు చేసుకుని రాష్ట్రానికి బయలుదేరారు. నిజానికి ఈ రోజు ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కావాల్సి ఉంది. అయితే.. తమకెంతో ఆప్తుడైన నారయణ మరణ వార్త తెలియడంతో వెనువెంటనే ఢిల్లీ నుంచి కడపకు జగన్ పయనమయ్యారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు, అక్కడినుంచి కడపకు జగన్ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా నారాయణ సొంతూరైన దిగువ పల్లెకు వెళ్లనున్నారు. సాయంత్రం 3.30 గంటల సమయానికి నారాయణ ఇంటికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు.

నారాయణకు వైఎస్ ఫ్యామిలీతో దాదాపు మూడు దశాబ్దాలకు పైనే అనుబంధం ఉంది. అందుకే ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా వైఎస్ ఫ్యామిలీ భావిస్తారు. ఇక నారయణతో జగన్ కు ఉన్న అనుబంధం కూడా ఎక్కువే.

   Politics

   Lifestyle