HomeTelugu politics

రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు : పవన్ కళ్యాణ్
Published By :  Lasya Raghavaraju Image Image
Beat rape accused with sugarcane until skin rips off: Pawan Kalyan
Thursday Dec 05, 2019
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై జన సేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. షాద్‌నగర్‌ ఘటన కేసులో  నిందితులైన ఆ నలుగురు రాక్షసులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం డిమాండ్ చేస్తుంటే, పవన్  మాత్రం రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు తోలు ఊడేలా కొడితే సరిపోతుంది చంపేస్తే ఏమొస్తుంది అని పవన్ వ్యాఖ్యలు చేసాడు. 

‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్‌ పేర్కొన్నారు. 

ఓ వైపు అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని, మర్మాంగాలను కోసేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. దానికి బదులుగా ఆ నరరూప రాక్షసులను కేవలం రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని పవన్ అనడం వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు పవన్ స్పృహలో ఉండే ఈ వ్యాఖ్యలు చేశారా..? అని ఘాటుగానే స్పందిస్తున్నారు. 

మరి పవన్ ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..!

   Politics

   Lifestyle