HomeTelugu politics

పవన్ కళ్యాణ్ కు చురకలంటించిన ఎమ్మెల్యే రాజాసింగ్
Published By :  Lasya Raghavaraju Image Image
MLA Raja Singh fires on Pawan Kalyan over Hinduism remarks
Tuesday Dec 03, 2019
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా హిందూమతంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ మరోసారి టీటీడీలో అన్యమత ప్రచారం హిందువులేనని, హిందూ నాయకుల కుట్ర లేనిదే ఇలాంటివి జరగవని అర్థంపర్థం లేని విమర్శలు చేశారు. దేశంలో సెక్యులరిజాన్ని ఇబ్బందిపెడుతోంది హిందువులు మాత్రమేనని, మిగతా మతాలవారు ఇలాంటి పనులు చేయరంటూ పవన్ రెచ్చిపోయి మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. ఈమేరకు ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు. " ధర్మం గురించి కనీసం అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నాడని, హిందూ మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం సబబు కాదని, సెక్యులరిజం అంటూ ఊగిపోతున్న పవన్‌కు కనీసం దానిపై  కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘పవన్‌‌ది ఏ మతం? అతడు మతం మార్చుకున్నాడా?’ అని ప్రశ్నించారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని" రాజా సింగ్ హెచ్చరించారు.

మరి రాజాసింగ్‌ వార్నింగ్‌పై జనసేన అధినేత ఎలా స్పందిస్తాడో చూడాలి.

   Politics

   Lifestyle