HomeTelugu politics

బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం
Published By :  Divya Valluru Image Image
Brahmanandam election campaign for BJP candidate Sudhakara Reddy
Monday Dec 02, 2019
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సరికొత్త అవతారం ఎత్తారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో డిసెంబర్ 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెల్సిందే. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. 

శనివారం చిక్కబళ్లాపురంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బ్రహ్మానందం రోడ్ షో నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి చూడటానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. సుధాకర రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు. అందుకే ఆయన తరపున ప్రచారానికి వచ్చానన్నారు. పలు తెలుగు సినిమా డైలాగ్స్ చెప్తూ ప్రజల్లో ఉత్సాహం నింపారు. 

బ్రహ్మానందం రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే  జేడీఎస్ అధినేత కూడా చిక్కబళ్లాపురంలో ప్రచారం నిర్వహించడం గమనార్హం.

   Politics

   Lifestyle