HomeTelugu politics

సీఎంలా ప్రవర్తించడంలేదు అందుకే జగన్ రెడ్డి అంటున్నా : పవన్
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan takes a dig at AP CM Jagan in his Rayalaseema tour
Monday Dec 02, 2019
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని రైల్వే కోడూరులో వైసీపీ అధినేత పై ఘాటు విమర్శలు చేసారు.  ఆయన కొంతమందికే సీఎం అని..ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయనను జగన్ రెడ్డి అని పేరు పెట్టే పిలుస్తానని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  

రైల్వే కోడూరు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీ పార్టీలోని కొద్దిమందికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తే మిమ్మల్ని జగన్ రెడ్డి అనే అంటాను. వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాధపడినా నేను ఈ మాటను వెనక్కితీసుకోను. నాకు వైసీపీ వాళ్లపై ద్వేషం ఉండదు. హుందాగా వ్యవహరించాలని జగన్ రెడ్డికి చెప్పండి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి.

‘వైసీపీ నేతలు పూర్తిగా ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారు. మాయమాటలు చెప్పి అధికారాన్ని సంపాదించారు. హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైసీపీకి లేదు.  ఆశయం కోసం పని చేసేవారికి గెలుపు ఓటములతో సంబంధం లేదు. అందుకే మేము ఓడిపోయినా.. ప్రజలు ఇప్పటికీ మమ్మల్ని ఆదరిస్తున్నారు. జగన్‌కు భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ.. కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ గడ్డ కాదు.. ఈ గడ్డ చదువుల తల్లి. వైఎస్ జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే.. నేను కూడా ఆయనికి మార్యాద ఇచ్చి మాట్లాడతా. జగన్ కొంతమందికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు.  అందుకే ఆయనను పేరు పెట్టి పిలుస్తున్నా’ అని పవన్ మండిపడ్డారు. 

   Politics

   Lifestyle