HomeTelugu politics

ప్రజ్ఞాను సజీవ దహనం చేస్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
Published By :  Divya Valluru Image Image
Congress MLA Govardhan says he would burn Pragya Singh Thakur alive
Friday Nov 29, 2019
లోక్‌సభలో ప్రసంగిస్తూ జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ అట్టుడికింది. ప్రజ్ఞా పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మరియు విపక్షాలు మండిపడిన విషయం తెలిసిందే.  దీంతో ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై క్రమశిక్షణ చర్యలు పేరిట బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా కంటి తుడుపు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.  

ఈ నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవర్థన్‌ డంగీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బయోరా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మధ్యప్రదేశ్‌లో కాలుపెడితే  ఆమెను  సజీవంగా దహనం చేస్తానని వ్యా‌ఖ్యానించారు. గోవర్ధన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మరోవైపు ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలకు నిరసిస్తూ.. ఆమె సొంత నియోజకవర్గమైన భోపాల్‌లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా తీవ్రంగా ఖండించారు.

   Politics

   Lifestyle