HomeTelugu politics

బీజేపీ కండువా కప్పుకున్న కౌశల్ మందా
Published By :  Ravi Koneri Image Image
Bigg Boss 2 winner Kaushal Manda joins BJP along with Byreddy Rajasekhar
Friday Nov 29, 2019
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా రాజకీయ అరంగేట్రం చేసాడు. గురువారం కౌశల్ ఆయన సతీమణి నీలిమతో కలిసి బీజేపీ లో చేరారు.  ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

కౌశల్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని, అందుకే వారితో కలిసి పనిచేయడానికి బీజేపీలో చేరినట్లు కౌశల్ వెల్లడించారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, 1994, 1999 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2004లో నందికొట్కూరు నుంచి, 2009లో పాణ్యం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


   Politics

   Lifestyle