HomeTelugu politics

గాడ్సేను పొగిడిన ప్రజ్ఞా సింగ్ పై వేటు పడింది
Published By :  Lasya Raghavaraju Image Image
BJP MP Pragya Singh removed from defence panel for praising Godse
Thursday Nov 28, 2019
వివాదాస్పద వాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే బోపాల్ బీజేపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. పార్లమెంట్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశ భక్తుడని వ్యాఖ్యానించింది. గాడ్సేను దేశ భక్తుడంటూ కీర్తించిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై విపక్షాలు మండిపడ్డాయి.  ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది.

ప్రజ్ఞా వ్యాఖ్యలపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. ఆమెను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి తప్పించడంతో పాటు ఈ సెషన్ లో  బిజేపీ పార్లమెంటరీ సమావేశాలలో పాల్గనేందుకు ఆమెను అనమతించబోమని జేపీ నడ్డా స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆమె చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు, సిద్ధాంతాలను బీజేపీ ఎన్నడూ బలపరచదని చెప్పారు.

బుధవారం రోజున లోక్‌సభలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ చట్టసవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు ప్రగ్యా ఠాకూర్ . ఆ సమయంలో మహాత్మాగాంధీని గాడ్సే ఎలా చంపారో అనే విషయాన్ని డీఎంకే సభ్యులు రాజా చెప్పారు. వెంటనే రాజా ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రగ్యా ఠాకూర్.. గాంధీని హత్యచేసిన గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ అభివర్ణించారు

మరోవైపు నాథూరాం గాడ్సేను దేశభక్తుడనే ఆలోచనకు స్వస్తి పలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 

   Politics

   Lifestyle