HomeTelugu politics

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయి రాజపక్సే
Published By :  Divya Valluru Image Image
Gotabaya Rajapaksa elected as new Srilanka President
Monday Nov 18, 2019
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కౌంటింగ్ ప్రతిదశలోనూ మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స సోదరుడు అయిన గోటబయ రాజపక్స ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 

ఆదివారం ఉదయం 11 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్సే 52.87 ఓట్లు గెలుచుకోగా, గృహ మంత్రి సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం, లెఫ్టిస్ట్ అనుర కుమార దిస్సానాయకె 4.69 శాతం ఓట్లు పొందినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సాజిత్‌ ప్రేమదాసకు తమిళులున్న ప్రాంతాల్లో ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ గోటబయాను దాటలేకపోయారు. ఓటమిని అంగీకరిస్తూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని పేర్కొన్నారు ప్రేమదాస.

70 ఏళ్ల గోటబయి రాజపక్స రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. 2008-2009లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.  శ్రీలంక అధ్యక్ష ఎన్నికల కోసం ఆయన తనకు ఉన్న అమెరికా పౌరసత్వాన్ని కూడా వదులుకోవడం విశేషం.

   Politics

   Lifestyle