HomeTelugu politics

చంద్రబాబు హూంకరింపులకు భయపడను : వల్లభనేని వంశీ
Published By :  Ravi Koneri Image Image
Vallabhaneni Vamsi strong warning to TDP Chief Nara Chandrababu Naidu
Saturday Nov 16, 2019
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన కొడుకు నారా లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే టీడీపీ పార్టీ నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయనకు షోకాజ్‌ నోటీసులు కూడా పంపింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ  నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు తనను టీడీపీ నుండి సస్పెండ్ చేయడంపై స్పందించిన వల్లభనేని వంశీ, ఆయన పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ ను విమర్శించాను. వాళ్లకు ఇంకా ఆప్షన్ ఏముంది? చంద్రబాబునాయుడు ఇంకేమి చేయగలడు? పళ్లు పటపటా నూరతాడా? ముసలిపళ్లు ఊడిపోతాయి. ఇక్కడిదాకా సౌండొస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబునాయుడు? చంద్రబాబునాయుడు తోక కత్తిరింపులు, బెదిరింపులు, హూంకరింపులు, కాళ్లు పట్టుకోవడాలు ఎప్పుడో చూసేశాము. ఎలక్షన్ల ముందు మోదీ, అమిత్ షాను ఎన్ని తిట్టాడు? ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు?” అంటూ బాబును విమర్శించారు.

లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయం, వణుకు, జ్వరం అని ఎద్దేవా చేశారు. తాజాగా వల్లభనేని ఇష్యూ నేపథ్యంలో బాబు, లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో స్పందించారు. టీడీపీకి ప్రజాదరణ తగ్గడానికి బాబు, లోకేష్‌లే కారణమని, ఇకనైనా పార్టీ పగ్గాలు మార్చకపోయే టీడీపీ ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని వంశీ హెచ్చరించారు.

   Politics

   Lifestyle