HomeTelugu politics

రజనీకాంత్ పెట్టబోయే పార్టీలోకి అళగిరి
Published By :  Ravi Koneri Image Image
Alagiri waiting for the launch of Rajanikanth's political party
Saturday Nov 16, 2019
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. రజనీకాంత్ నేను పార్టీ పెడతానని చెప్పి సంవత్సరం దాటి పోయింది ఆయన రాజకీయ రంగప్రవేశం పై రోజుకొక పుఖారు వినిపిస్తుంది. ఆయన బీజీపీ పార్టీలో చేరనున్నారని కూడా వార్తలు బయటికొచ్చాయి. అయితే ఈ వార్తలను రజినీ ఖండించారు. 

తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అళగిరి మాట్లాడుతూ ”నేను ప్రస్తుతం డీఎంకే పార్టీలో లేను. ఆ పార్టీకి నాకు సంబంధం ఏమి లేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి,జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ వెలతి ఏర్పడింది.ప్రస్తుతం తమిళనాడుకు నాయకుడు కావాలి. అది సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే న్యాయం చేయగలరు. ఆయన త్వరలోనే పార్టీ పెడతారని ఆశిస్తున్నానని అన్నారు. 

దీనికి స్పందించిన విలేఖర్లు మీరు రజనీకాంత్ పెట్టబోయే పార్టీలో చేరతారా అని అడగ్గా .. ముందు అయితే రజనీ కాంత్ పార్టీని పెట్టానివ్వాలి కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

   Politics

   Lifestyle