HomeTelugu politics

టీడీపీకి రాజీనామా చేసిన దేవినేని అవినాష్
Published By :  Lasya Raghavaraju Image Image
Devineni Avinash submits resignation to TDP; to join YSRCP
Thursday Nov 14, 2019
తెలుగుదేశం పార్టీ నుంచి మరో నాయకుడు బయటకొచ్చేసాడు. విజయవాడకు చెందిన టీడీపీ నేత,  తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఉదయం తాను పార్టీ సభ్యుత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అవినాశ్.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 

టీడీపీపై కొంతకాలంగా దేవినేని అవినాష్ అసంతృప్తితో ఉన్నారు.  ఎన్నికలలో  తాను పోటీ చేయనన్నా బలవంతంగా కొడాలి నానిపై పోటీ చేయించారు చంద్రబాబు నాయుడు. నానీ చేతిలో ఓటమి చెందిన తర్వాత తననూ, తన అనుచరులనూ టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట.  టీడీపీలో తనకు తగిన గుర్తింపు లభించడంలేదని అనుచరులతో పలు సందర్భాల్లో అవినాష్ చెప్పినట్లు సమాచారం.

ఏపీ యువతలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న అవినాష్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగగా, పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

   Politics

   Lifestyle