HomeTelugu politics

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా
Published By :  Lasya Raghavaraju Image Image
Devendra Fadnavis resigned as Maharastra Chief Minister
Friday Nov 08, 2019
మహారాష్ట్రలో గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోశియారికి కలిసి రాజీనామాను సమర్పించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గడువు నేటితో ముగిసి పోవడంతో ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. కాగా, ఫడ్నవీస్ రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే నేటికీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా ఓటర్లు తీర్పునిచ్చారు.  బీజేపీకి మహారాష్ట్రలో 105, శివసేనకి 56 సీట్లు దక్కాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. కాగా శివసేన, బీజేపీలు ముఖ్యమంత్రి కుర్జీ మాదంటే మాదంటూ పట్టుబడుతుండడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

   Politics

   Lifestyle