HomeTelugu politics

చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరణ
Published By :  Lasya Raghavaraju Image Image
Permission rejected for Chandrababu Vijayawada Deeksha
Friday Nov 08, 2019
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక కొరతకు నిరసనగా ఈనెల 14 వతేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ విజయవాడలో  దీక్ష చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు దీక్షకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు విజయవాడ నగర పోలీసు కమిషనర్ ను కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగంచే మున్సిపల్ స్టేడియంలో అనుమతి ఇవ్వలేమంటూ పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేయడానికి అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయ స్థలాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. బహుశ ధర్నా చౌక్ లో చంద్రబాబు దీక్ష చేసే అవకాశముంది. అయితే, 12 గంటల పాటు చంద్రబాబు చేసే దీక్షకు పార్టీ శ్రేణులతో పాటు, ఇతర పార్టీ నేతలు, భవన నిర్మాణ కార్మికులు భారీగా  తరలి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ధర్నా చౌక్ సరైన వేదిక కాదనే అభిప్రాం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం నాడు మున్సిపల్ స్టేడియంలో ధర్మ పోరాట దీక్ష చేసారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా  చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.

   Politics

   Lifestyle