HomeTelugu politics

నేను బీజేపీ వ్యక్తిని కాదు : రజినీకాంత్
Published By :  Divya Valluru Image Image
Superstar Rajinikanth slams reports of joining BJP
Friday Nov 08, 2019
తమిళ సుపర్ స్టార్ రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని స్వయంగా ప్రకటించారు. అప్పటినుంచి రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై రోజుకో ప్రచారం జరుగుతూనే ఉంది. రజిని సొంత పార్టీ పెట్టనున్నాడని ఒకసారి, ఆయన భారతీయ జనతా పార్టీ లో చేరనున్నారని అందుకే ఆయన వారికి దగ్గర అవుతున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ రజినీ మనసులో ఏం ఉంది అని అభిమానుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలోనే ఆయనపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. 

శుక్రవారం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నూతన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ....‘నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు వేయకండి. గొప్ప రచయిత అయిన తిరువళ్లువర్ లాంటి వ్యక్తులపై కూడా రాజకీయాలు చేయకండి‘ అంటూ రజిని కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు. 

ఇటీవల తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాల వేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ దుమారం నడిచింది. రజినీ వ్యాఖ్యలతో ఆయన బీజేపీకి దూరంగా ఉంటారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.  

   Politics

   Lifestyle