HomeTelugu politics

సైకిల్ దిగేసిన సాధినేని యామిని.. బీజేపీలో చేరే అవకాశం
Published By :  Lasya Raghavaraju Image Image
Sadineni Yamini quits TDP; likely to join BJP on Nov 10
Friday Nov 08, 2019
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలోకి వచ్చి కొద్దిటైంలోనే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుతెచ్చుకుని టీడీపీ అధికార ప్రతినిధి హోదాను దక్కించుకున్న సాధినేని యామిని త్వరలో సైకిల్ దిగి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీ చర్చావేదికల్లో, అనేక బహిరంగ సభల్లో టీడీపీ తరపున స్ట్రాంగ్ వాయిస్ వినిపించిన యామిని ఎన్నికలలో ఓటమి తర్వాత తెలుగు దేశం పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గురువారం ఆమె తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టుకు రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం తాను స్వదస్తూరితో రాసిన లేఖను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. 

నారా లోకేష్ స్నేహితురాలిగా పేరున్న సాధినేని యామిని శర్మ త్వరలో బిజెపిలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా ఆమె బిజెపి రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడానికి అంగీకరించడంతో ఆమె టిడిపికి రాజీనామా చేసారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 10న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సాధినేని యామిని కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. 

   Politics

   Lifestyle