HomeTelugu politics

తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మి పార్వతి
Published By :  Divya Valluru Image Image
Lakshmi Parvathi appointed as Telugu Academy Chairperson
Wednesday Nov 06, 2019
దివంగత టీడీపీ అధినేత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతికి నామినేటెడ్ పదవి వరించింది. లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉన్న వారిలో లక్ష్మీపార్వతీ ఒకరు. వైసీపీలో ఉంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్నా నేడు అధికారంలో ఉన్న సమయంలోను పార్టీ లేదా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతుంటారు. వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో తనదైన శైలిలో విరుచుకుపడే లక్ష్మి పార్వతి గారికి జగన్ త్వరలో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ జగన్ ఇప్పుడు ఆమెకు కీలక పదవి అప్పగించా

ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటినుంచి  పార్టీలో తనను నమ్ముకుని తనవెంట నడిచిన వారికి జగన్ కీలక పదవులను కట్టబెడుతూ వస్తున్నారు. రోజాకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఇప్పుడు నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

   Politics

   Lifestyle